మరి కొన్ని రోజుల్లో టీమ్ ఇండియా వరల్డ్ కప్ లో బరిలోకి దిగబోతుంది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీ నుంచి కూడా ఈ వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇక వన్డే వరల్డ్ కప్లో టీమ్ ఇండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగపోతుంది. దీనికి కారణం ఇక భారత జట్టు సొంత గడ్డపై వరల్డ్ కప్ ఆడుతూ ఉండడమే. అయితే ఇక వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే అటు టీమిండియా ఆసియా కప్ లాంటి మరో మెగా టోర్ని ఆడింది అని చెప్పాలి. అయితే ఇక ఆసియా కప్ లో టీమిండియా టైటిల్ విజేతగా నిలిచింది అంటే వరల్డ్ కప్ లో టైటిల్ గెలవడం ఖాయమని ఎంతో మంది విశ్లేషకులు  కూడా అంచనా వేశారు.


 అయితే ఇక ఆసియా కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా అదరగొట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదట ఫైనల్ లోకి అడుగుపెట్టిన టీం గా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ఫైనల్ మ్యాచ్లో మొదటి నుంచి శ్రీలంక పై పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది. ముఖ్యంగా భారత బౌలింగ్ విభాగం దెబ్బకు అటు శ్రీలంక చతికిలబడిపోయింది అని చెప్పాలి. ఏకంగా ఫైనల్ మ్యాచ్లో కేవలం 50 పరుగులు మాత్రమే చేసి ఇక ఆల్ అవుట్ అయింది.


 ఇక ఆ తర్వాత అతి స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా ఒక వికెట్ కూడా కోల్పోకుండానే టార్గెట్ చేదించింది  అది కూడా కేవలం 6.1 ఓవర్లలోనే టార్గెట్ చేయించడం గమనార్హం. ఈ క్రమంలోనే ఒక చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఏకంగా అత్యధిక వేగంగా విజయం సాధించి చరిత్ర సృష్టించింది. అయితే ఫైనల్ లో బంతులు పరంగా 263 బాల్స్ ఉండగానే విజయం సాధించిన తొలి జట్టుగా భారత్ నిర్మించింది   అంతకుముందు 2003లో వన్డే ఫైనల్ ఇంగ్లాండ్ పై 223 బంతుల తేడాతో ఆసిస్ విజయం సాధించింది. ఇక ఇప్పుడు భారత్ ఆ రికార్డును బద్దలు కొట్టింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: