
అయితే ఇక వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి ఇంకా ఎన్నో రోజుల సమయం లేని నేపథ్యంలో.. ఇక అన్ని టీమ్స్ కూడా సిద్ధమైపోతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో కొన్ని టీమ్స్ కి మాత్రం ఊహించని షాకులు తగులుతున్నాయి. ఏకంగా జట్టులో ఉన్న ఆటగాళ్ళు వరుసగా గాయాల బారిన పడుతూ ఇక వరల్డ్ కప్ టోర్నీ మొత్తానికి దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా టీం కి కూడా వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఇలాంటి ఒక భారీ షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జట్టులో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న అన్రిచ్ నోర్జేతో పాటు సిసింద మగల గాయల బారిన పడ్డారట. ఇక గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వరల్డ్ కప్ టోర్నీకి పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇక వారి స్థానంలో అడింలే, లిజాద్ విలియమ్సన్ ను జట్టులోకి తీసుకున్నట్లు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కి 15 మంది సభ్యులతో కూడిన రివైజ్డ్ జట్టును ప్రకటించింది. కాగా సౌత్ ఆఫ్రికా జట్టుకి టెంప బావుమా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.