
గత రెండు సంవత్సరాలుగా మొహమ్మద్ నవాజ్, మరియు షాదాబ్ ఖాన్ పాకిస్తాన్ టీం తరుపున చాలా బాగా పెర్ఫర్మ్ చేసారని, అందుకే వారిని ప్రపంచ కప్ కు సెలెక్ట్ చేశామని చెప్పారు ఇంజమామ్ ఉల్ హాక్. ప్రపంచ కప్ టీం ఎన్నో ఏళ్లుగా ప్లాన్ చేసి తయారు చేయబడిందని, ఇప్పుడు సడన్ గా అందులో మార్పులు చెయ్యడం సాధ్యం కాదని ఆయన అన్నారు. మధ్య ఓవర్లలో వారు వికెట్లు తియ్యలేకపోతున్నప్పటికీ, వారి స్థాయి ప్రదర్శన వారు చేస్తున్నారని, వారిద్దరి పై తమకు నమ్మకం ఉందని అన్నారు ఇంజమామ్. ఇకపోతే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నజీమ్ షా ప్రపంచ కప్ కు దూరమైనట్టు తెలుస్తోంది. ఆసియ కప్ లో గాయానికి గురైన నజీమ్ ఇంకా కోలుకోకపోవడంతో, హాసన్ అలీ ని టీం లోకి తీసుకున్నట్టు తెలిపారు ఇంజమామ్.