
ఈ వరల్డ్ కప్ ను ప్రేక్షకులందరికీ కూడా మరింత చేరువ చేసేందుకు వ్యాఖ్యాతలు అందరూ కూడా సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే భారత్ వేదికగా జరగబోయే వన్డే ప్రపంచ కప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కామెంటెటర్ల జాబితాను ప్రకటించింది. ఏకంగా 31 మంది సభ్యులతో కూడిన వ్యాఖ్యాతల వివరాలను ఇటీవల వెల్లడించింది. ఐసీసీ ప్రకటించిన కామెంట్రీ ప్యానెల్ లో భారత్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ న్యూజిలాండ్ దేశాలకు చెందిన లెజెండరీ క్రికెటర్స్ ఉన్నారు. ఏకంగా భారత్ నుంచి ఆరుగురికి మాత్రమే ఈసారి అవకాశం దొరికింది. ఇందులో రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్, దినేష్ కార్తీక్, సంజయ్ మంజ్రేకర్, అంజూమ్ చోప్రా, హర్ష భోగ్లే వరల్డ్ కప్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించబోతున్నారు. గౌతమ్ గంభీర్ కు మాత్రం కామెంట్రీ ప్యానల్ లో చోటు దొరకలేదు.
ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన కామెంట్రీ ప్యానెల్‌వివరాలు చూసుకుంటే.. న్యూజిలాండ్ నుంచి ఇయాన్ స్మిత్, సైమన్ డౌల్, కేటీ మార్టిన్ చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్ నుంచి ఇయాన్ మోర్గాన్, నాసర్ హుస్సేన్, మైఖేల్ ఆథర్టన్, మార్క్ నికోలస్, ఇయాన్ వర్డ్, పాకిస్థాన్ నుంచి రమీజ్ రాజా, వకార్ యూనీస్, అథర్ అలీ ఖాన్, వెస్టిండీస్ నుంచి ఇయాన్ బిషప్, శామ్యూల్ బద్రీ, సౌతాఫ్రికా నుంచి షాన్ పోలాక్, కస్తూరీ నాయుడు, నటాలీ జెర్మనోస్, జింబాబ్వే నుంచి ఎంపులెలో ఎంబాంగ్వా, శ్రీలంక నుంచి రసెల్ ఆర్నాల్డ్ ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు.