
ఇంకొంతమంది ఇక టీవీల ముందు కూర్చుని వరల్డ్ కప్ ఎంటర్టైన్మెంట్ను ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇక ఎవరికైనా సరే అటు ప్రపంచ కప్ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించాలని ఆశ ఉంటుంది ఇలాంటి సమయంలో ఏదైనా రికమండేషన్స్ ఉంటే ఎంత బాగుండు అని కొంతమంది కోరుకుంటూ ఉంటారు. అలాంటిది ఏకంగా భారత జట్టులోనో లేకపోతే ఇక భారత జట్టు సిబ్బంది లోనో తెలిసిన వాళ్ళు ఉంటే టికెట్లు కావాలని వాళ్ళని రికమెంట్ చేయమని చెప్పడం సర్వసాధారణం. అయితే ఈ విషయంలో విరాట్ కోహ్లీ కాస్త ముందు జాగ్రత్త తీసుకున్నాడు.
వరల్డ్ కప్ టికెట్లు కావాలని తన స్నేహితులు ఎవరు అడగద్దు అంటూ సూచించాడు. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు స్నేహితులెవరూ తనను టికెట్లు అడగవద్దని.. అందరూ ఇళ్ళనుంచే మ్యాచ్లను చూసి ఎంజాయ్ చేయాలని.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రిక్వెస్ట్ చేశాడు. ఈ మేరకు తన స్నేహితులను ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టాడు. దేశంలో 2023 వరల్డ్ కప్ సంబరం మొదలైంది. ఈ సందర్భంగా నా స్నేహితులందరికీ ఒక అభ్యర్థన చేస్తున్న. టోర్ని అసాంతం దయచేసి స్నేహితులు ఎవరు టికెట్లు ఇప్పించమని అడగవద్దు. హాయిగా టీవీలో చూస్తూ మ్యాచ్ ఎంజాయ్ చేయండి అంటూ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.