కట్టుకున్న భార్య ఎంతో డేంజర్.. ఇది ఎవరో చెప్పడం కాదు ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంది. ఏకంగా భార్య పైనే జోకులు మీమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. భర్తలు భార్యలపై పెత్తనం చెలాయించినట్లు ఊహల్లో బతికేస్తారు. కానీ అసలు జరిగేది మాత్రం మరోలా ఉంటుందని.. ఎన్నో జోక్స్ సోషల్ మీడియాలో పేలుతు ఉంటాయి. ఇక భార్యతో మాట్లాడేటప్పుడు భర్తలు కాస్త నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే అదే వాళ్లకి చివరి బర్త్ డే అంటూ ఇంకొన్ని రకాల జోక్స్ కూడా చూసే ఉంటారు. అవును ఇది నిజమే ఎందుకంటే పెళ్లి చేసుకుని మేము కూడా అనుభవిస్తున్నామని ఎంతో మంది భర్తలు.. ఇలాంటి జోకులకి కామెంట్లు చేస్తుంటే..  ఊరుకోండి బాసు అలా ఎందుకు జరుగుతుంది. మేం కూడా వైవాహిక బంధం లోనే ఉన్నాం కదా అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా భార్య అనే మెటీరియల్ మాత్రం చాలా డేంజర్ అని భర్తలు కొంతమంది సీరియస్గా.. ఇంకొంతమంది జోక్ గా ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. అయితే భార్యతో పెట్టుకుంటే ఎంత ప్రమాదం పొంచి ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సర్వసాధనం. ఇలాంటి గొడవలు జరిగినప్పుడే ఏకంగా వారి బంధం కూడా మరింత బలపడుతుంది అని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ భార్యతో జరిగిన చిన్న గొడవ ఏకంగా అతన్ని ఆసుపత్రిపాలు చేసింది. అంతేకాదు సర్జరీ చేయించుకునే పరిస్థితికి కారణమైంది.


 ఢిల్లీలోని సుల్తాన్ పూరి లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 20వ తేదీన ఇంటిని అమ్మేసి తన వాటా ఇచ్చేయాలని భర్తతో భార్య గొడవకు దిగింది. అయితే భార్యతో గొడవ పడి భర్త అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా.. నిందితురాలు వెనకనుంచి అతనిపై దాడి చేసింది. ఏకంగా అతని చెవిని కొరికేసింది. దీంతో బాధితుడు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చెవిని పూర్తిగా కొరికి వేయడంతో ఇక ఆ చెవిని సర్జరీ చేసి అతికించాలి అని వైద్యులు సూచించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: