
ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఒకే బంతికి ఏడు పరుగులు వచ్చాయ్. అదేంటి ఒకే బంతికి ఏడు పరుగులు రావడం ఏమైనా కొత్త. వరల్డ్ క్రికెట్లో ఇప్పటివరకు జరిగిన చాలా మ్యాచ్ లలో ఇది జరిగింది కదా. బంతిని వేసినప్పుడు అది నోబాల్ అయితే ఆ తర్వాత ఫ్రీ హిట్ ను బ్యాట్స్మెన్ సిక్సర్ గా మలిచినప్పుడు ఇక ఎలాగో ఒకే బంతికి ఏడు పరుగులు వస్తాయి అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ జరిగింది తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు. సిక్సర్ నమోదు అవ్వలేదు. కానీ ఏకంగా ఒకే బంతికి ఏడు పరుగులు వచ్చాయి. అదెలా సాధ్యమైంది అనుకుంటున్నారు కదా.
ప్రస్తుతం ఆస్ట్రేలియా తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు ముందు పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్లతో బిజీగా ఉంది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో ఒకే బంతికి సిక్సర్ నమోదవ్వకుండానే ఏడు పరుగులు వచ్చాయి. మాథ్యూ రెన్హ ఒకే బంతికి ఇలాంటి రికార్డు సాధించాడు. అబ్రార్ అహ్మద్ వేసిన బంతికి రెన్హా కొట్టిన షాట్ బౌండరీ వెళ్లకుండా హమ్జా అడ్డుకున్నాడు. అయితే పరుగులు తీస్తుండగా మరో ఫీల్డర్ నాన్ స్ట్రైకర్ వైపు బంతి విసరగా అది మిస్సయి చివరికి ఫోర్ వెళ్లడంతో ఇలా ఒక సిక్సర్ నమోదు అవ్వకుండానే ఒకే బంతికి ఏడు పరుగులు వచ్చాయి అని చెప్పాలి.