హీరోయిన్ మృణాల్ ఠాగూర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సీతారామం అనే ఒక  క్లాసికల్ లవ్ స్టోరీ తో ప్రేక్షకులు ముందుకు తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో మృనాల్ నటన ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక ఈ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక సీతారామం తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా మారిపోయింది. కేవలం సినిమాలో మాత్రమే కాదు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. అయితే ఇటీవల నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్గా నటించింది మృనాల్ ఠాగూర్. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ మూవీలో మృనాల్ ఠాకూర్ నటనకు మరోసారి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే హాయ్ నాన్న సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. హీరో నాని హీరోయిన్ మృణాల్ ఠాగూర్ వివిధ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు అని చెప్పాలి.ఈ క్రమంలోని ఇటీవలే ప్రమోషన్స్ లో ఒక థియేటర్ను సందర్శించింది  మృనాల్ ఠాగూర్. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో  పెళ్లి గురించి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురయింది. అయితే త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అంటూ ఈ హీరోయిన్ తెలిపింది. ప్రస్తుతం హాయ్ నాన్న సినిమా ప్రదర్శితం అవుతున్న అమెరికాలోని ఒక థియేటర్ను మృనాల్ ఠాకూర్ సందర్శించింది. ఈ సందర్భంగా ఒక అభిమాని మీకు పెళ్లయిందా అని అడగగా.. లేదు త్వరలోనే చేసుకుంటాను అంటూ సమాధానం చెప్పింది మృణాల్ ఠాగూర్  ప్రస్తుతం ఈ హీరోయిన్ విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ అనే మూవీలో నటిస్తుంది. ఈ షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: