ఐపీఎల్ కెరియర్ లో ఒకసారి టైటిల్ విజేతగా కొనసాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక ఇప్పుడు ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. మొదటి మ్యాచ్ చూసిన తర్వాత ఇక ఆ జట్టు అభిమానులందరికీ కూడా ఇదే స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే బౌలింగ్ విభాగంలోనే కాదు బ్యాటింగ్ విభాగం లో కూడా ఇక ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చింది జట్టు. ఇక కొత్త కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ జట్టును ముందుకు నడిపిస్తున్న తీరు ప్రేక్షకులు అందరికీ కూడా తెగ నచ్చేసింది అని చెప్పాలి. ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో దాదాపు గెలిచినంత పని చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. చివరికి ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో నాలుగు పరుగులు తేడాతో ఓటమిపాలు అయింది అన్న విషయం తెలిసిందే.


 అయితే గత కొంతకాలం నుంచి టీమిండియా కు దూరమైన భారత సీనియర్ ఫేసర్ భువనేశ్వర్ కుమార్ ఇక ఇప్పుడు ఐపీఎల్ లో అదరగొట్టేస్తూ ఉన్నాడు. తన బౌలింగ్ తో పరుగులను కట్టడం చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి  అయితే ఇక ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ ఒక అరుదైన రికార్డు కోల్పోయాడు. మొన్నటి వరకు టి20 కెరియర్లో భువనేశ్వర్ కుమార్ ఒక్క నోబాల్ కూడా వేయని బౌలర్గా కొనసాగాడు. కెరియర్ మొత్తంలో ఇప్పటివరకు ఒక్క నో బాల్ కూడా వేయలేదు అని చెప్పాలి. కానీ ఇటీవల జరిగిన మ్యాచ్లో మాత్రం ఈ రికార్డును కోల్పోయాడు.


 ఇలా ఇప్పటివరకు టి20 క్రికెట్లో ఒక్క నోబాల్ కూడా వేయని ఫేస్ బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ పై ఉన్న రికార్డు ఇటీవల చెరిగిపోయింది. ఎందుకంటే ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక నోబాల్ వేశాడు భువనేశ్వర్ కుమార్. ఏకంగా లైన్ దాటి (ఓవర్ స్టెప్) బంతి వేశాడు. దీంతో అంపైర్ దీనిని నోబాల్ గా ప్రకటించాడు. ఇక ఇదే భువనేశ్వర్ కెరీర్ లో మొదటి నోబాల్ కావడం గమనార్హం. కాగా ఇక ఈమ్యాచ్లో 4 ఓవర్లు వేసిన భువనేశ్వర్ కుమార్ 51 పరుగులు సమర్పించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl