ఐపీఎల్ లో కెప్టెన్సి విషయంలో కఠినమైన రూల్స్ కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమాణాలు తప్పవు. ఈ క్రమంలోనే నిర్ణీత సమయంలోగా ఒక కెప్టెన్ తమ జట్టు వేయాల్సిన ఓవర్ల కోటాను పూర్తి చేయకపోతే.. ఇక ఆ జట్టు కెప్టెన్ కి ఐపీఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ భారీగా జరిమానా విధించడం చేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ జరిమానా పడిన తర్వాత మరో మ్యాచ్ లో ఇదే రిపీట్ అయితే.. ఏకంగా ఆ కెప్టెన్ కి ఒకటి లేదా రెండు మ్యాచ్లపై విషయం విధించడానికి కూడా వెనకడుగు వేయరు ఐపీఎల్ నిర్వహకులు అన్న విషయం తెలిసిందే.


 అయితే ప్రస్తుతం హోరాహోరీగా జరుగుతున్న 2024 ఐపిఎల్ సీజన్లో పలు జట్ల కెప్టెన్లు ఇప్పటికే కొన్ని మ్యాచ్లలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇక భారీగా జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన కెప్టెన్లలో మొదటి వరుసలో ఉన్నాడు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్  ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా ఏకంగా అతనికి 12 లక్షల జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వహకులు. అయితే రెండవసారి స్లో రేటు నమోదైతే  తప్పకుండా నిషేధం విధిస్తారు. ఒక మ్యాచ్ పాటు అతను ఇక జట్టుకు దూరంగానే ఉండాలి.అయితే ఇటీవలే లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో తృతిలో ఇలాంటి నిషేధాన్ని తప్పించుకున్నాడు రిషబ్ పంత్.



 అదేంటి త్రుటిలో నిషేధాన్ని  తప్పించుకోవటం ఏంటి అని అనుకుంటున్నాను కదా.. లక్నోతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 16 ఓవర్ వరకు కూడా ఇక నిర్ణీత ఓవర్ల కోటని పూర్తిచేయలేదు. ఇక అప్పటికే వెనకబడి ఉన్నారు. కానీ మిగిలిన నాలుగు ఓవర్లలో రిషబ్ పంత్ జట్టు ఇక వేగంగా బౌలింగ్ చేయడంతో చివరికి తృటిలో నిషేధాన్ని తప్పించుకున్నాడు. ఇకపోతే జట్టు ప్రదర్శన విషయానికి వస్తే ఈ ఏడాది రిషబ్ పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. చెత్త ప్రదర్శనతో నిరాశపరిచింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లలో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి పాయింట్లు పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: