ప్రతి ఏడాది బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక ఈ ఏడాది కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతున్న మ్యాచ్లు ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైర్మెంట్ పంచుతూ ఉన్నాయి అని చెప్పాలి. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న పోరును చూసి ప్రేక్షకులందరూ కూడా అదిరిపోయే క్రికెట్ మజాని పొందుతూ ఉన్నారు. కొంతమంది టీవీల ముందు కూర్చుని క్రికెట్ మ్యాచ్లను వీక్షిస్తూ ఉంటే ఇంకొంతమంది స్టేడియం కి వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్లను వీక్షించడం చేస్తూ ఉన్నారు. అయితే ఇక ఈ ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ను డబుల్ చేయడనే లక్ష్యంగా వివిధ భాషల్లో అటు కామెంట్రీ కూడా అందుబాటులో ఉంది. ప్రతి క్రికెట్ మ్యాచ్ కి ఈ కామెంట్రీ ఎంతో ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అటు మైదానంలో జరిగే అద్భుతాలు అన్నింటినీ కూడా కామేంటేటర్లు తమ గాత్రంతో ప్రేక్షకుల మదికి చేరేలా చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇలాంటి కామెంట్రీ  లేకపోతే ఇక ఉత్కంఠ భరితమైన క్రికెట్ మ్యాచ్ కూడా అటు మూకి డ్రామాగా మారిపోతూ ఉంటుంది. అందుకే ప్రతి క్రికెట్ మ్యాచ్ కి కామెంటేటర్లు ఎంతో ఇంపార్టెంట్. కాగా ఇటీవల కామెంటెటర్ల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోమంది కామెంట్రీ బాక్స్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సమయంలో కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.


 ఈ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మ్యాచ్ సమయంలో కామెంటేటర్లు వీడియోలు లేదా ఫోటోలను షేర్ చేయకుండా ఆంక్షలు విధించబోతున్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఫాలోవర్లను పెంచుకోవడానికి మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫోటోలను పోస్ట్ చేస్తున్నారని బిసిసిఐ అభిప్రాయపడినట్లు సమాచారం. ఇకపై ప్లేయర్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, ఇక కామెంటెటర్ల సోషల్ మీడియా ఖాతాలపై బీసీసీఐ ప్రత్యేకమైన నిఘా పెట్టబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl