భారత జట్టుకు రాబోయే కొత్త కోచ్ ఎవరు? గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో ఈ విషయం గురించి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం హెడ్ కోచ్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఎప్పుడో ముగిసింది. కానీ బీసీసీఐ పెద్దల స్పెషల్ రిక్వెస్ట్ తో కొన్నాళ్లపాటు ఆయన భారత జట్టుకు హెడ్ కోచ్గా ఉండేందుకు ఒప్పుకున్నారు. అయితే రెండోసారి మాత్రం ఆ పదవిలో కొనసాగేందుకు ఆయన ఇష్టపడలేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బీసీసీఐకి కొత్త కోచ్ ను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల కొత్త కోచ్ కోసం అటు బీసీసీఐ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది అన్న విషయం తెలిసిందే.


 దీంతో రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమ్ ఇండియాకు హెడ్ కోచ్ గా రాబోయే ఆటగాడు ఎవరు అనే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. అయితే కొంతమంది మాజీ ప్లేయర్ల పేర్లు కూడా తెరమీదికి వస్తున్నాయి. ఐపీఎల్ లో చెన్నై కోచ్ గా వ్యవహరిస్తున్న స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్, భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ పేర్లు వినిపించాయి. అయితే గౌతమ్ గంభీర్  ను హెడ్ కోచ్ చేసేందుకు అటు బీసీసీఐ తీవ్రంగానే శ్రమిస్తుంది అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. అయితే గౌతమ్ గంభీర్ కూడా హెడ్ కోచ్ పదవి బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది.



 అయితే ఇలా హెడ్ కోచ్ పదవి బాధ్యతలు చేపట్టేందుకు భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అంగీకరించినప్పటికీ ఇక బిసిసిఐ పెద్దల ముందు ఒక కండిషన్ పెట్టాడట. ఎందుకంటే కోచ్ పదివికి అప్లై చేసిన తర్వాత తననే ఎంపిక చేయాలని బీసీసీఐకి కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. ద్రావిడ్ స్థానంలో కచ్చితంగా తానే ఉండాలని స్పష్టం చేశాడట. కేవలం దరఖాస్తుదారుడుగా తనకు ఉండిపోవాలని అస్సలు లేదు అని కండిషన్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే గౌతమ్ గంభీర్ ఒకవేళ కోచ్ పదవీ బాధ్యతలు చేపడితే ఇక  అటు ఐపీఎల్లో కోల్కతా మెంటర్ బాధ్యతలను వదులుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: