కేవలం అభిమానులు మాత్రమే కాదు 130 కోట్ల మంది భారతీయులు కూడా వినేష్ గోల్డ్ గెలిచి భారత్కు తిరిగి రావాలి అని ప్రార్థించారు. కానీ విధి మరోలా తలచింది. ఏకంగా 100 గ్రాముల అధిక బరువు కారణంగా సెమీఫైనల్ గెలిచి ఫైనల్ వెళ్లిన వినేష్ పొగాట్ పై అనర్హత వేటు పడింది. దీంతో ఇండియన్స్ అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఇలా అనర్హత వేటుకు గురైనప్పటికీ.. ఆమె తమ దృష్టిలో మాత్రం ఛాంపియన్ అని ఎంతో మంది సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు.
అయితే ఇలా ఒలంపిక్స్ లో అసమాన్యమైన ప్రతిభ కనబరిచి చివరికి అనర్హత వేటుకు గురైన వినేష్ పొగాట్ కు మరింత గౌరవం ఇచ్చే ఆమెను రాజ్యసభకు ఎంపిక చేయాలి అంటూ డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న వయస్సు దృశ్య వినేష్ రాజ్యసభకు వెళ్లలేరు. ఎందుకంటే పెద్దల సభగా పిలుచుకునే రాజ్యసభకు పంపించాలి అంటే కనీస వయస్సు 30 సంవత్సరాలు నిండి ఉండాలి. కానీ ప్రస్తుతం వినేష్ పొగాట్ వయసు 29 సంవత్సరాలు. ఆగస్టు 25 నాటికి ఆమె 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. అయితే సెప్టెంబర్ మూడవ తేదీన రాజ్యసభ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ.. ఆగస్టు 21వ తేదీ నాటికి నామినేషన్ పూర్తవుతుంది. దీంతో వినేష్ పొగాట్ ను రాజ్యసభకు పంపాలి అంటే మాత్రం ఇంకొంత కాలం పాటు వెయిట్ చేయక తప్పదు.