కానీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్‌లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ మాత్రం తనకిష్టమైన ఫుడ్ కోసం ఒక సూపర్ ఐడియా వేశాడు. రిపోర్ట్స్ ప్రకారం, ట్రైనింగ్ క్యాంప్‌కి రాగానే కోహ్లీకి ఒక ఫుడ్ ప్యాకెట్ అందింది. పర్సనల్ చెఫ్‌లను బ్యాన్ చేసినా, లోకల్ టీమ్ మేనేజర్ ద్వారా భోజనం తెప్పించుకున్నాడు మన కింగ్ కోహ్లీ భాయ్.
మేనేజర్ కూడా మామూలోడు కాదుగా.. కోహ్లీ ఫుడ్ విషయంలో ఏం ఇష్టపడతాడో తెలుసుకుని మరీ ఒక మంచి ఫుడ్ జాయింట్ నుంచి భోజనం తెప్పించాడు. రిపోర్ట్స్ ప్రకారం "మేనేజర్ ఇచ్చిన దానిలో కోహ్లీ కోసం పోస్ట్-సెషన్ మీల్ బాక్సులు కొన్ని ఉన్నాయి. అందరూ సర్దుకుంటుంటే, కోహ్లీ మాత్రం ఫుల్లుగా లాగించేశాడు. అంతేకాదు, ఒక బాక్స్ మళ్లీ తినడానికి దాచుకున్నాడు కూడా."
బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం, ఆటగాళ్లు పర్సనల్ స్టాఫ్‌ను తీసుకురావాలంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే కుదరదు. ఈ రూల్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా వర్తిస్తుంది. గంభీర్ పర్సనల్ అసిస్టెంట్ ఇంతకుముందు టీమ్ హోటల్‌లోనే గంభీర్‌తో పాటు ఉండేవాడు, టీమ్‌తో పాటే తిరిగేవాడు. కానీ ఇప్పుడు అతన్ని కూడా సపరేట్‌గా ఉండమని చెప్పేశారు.
కొత్త రూల్స్ రావడంతో కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా లాంటి సీనియర్ ప్లేయర్లు మళ్లీ డొమెస్టిక్ క్రికెట్‌లోకి రావాల్సి వచ్చింది. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడారు. కోహ్లీ, రోహిత్ అంతగా రాణించకపోయినా, డొమెస్టిక్ క్రికెట్‌కు తామే ఫస్ట్ ప్రయారిటీ అని బీసీసీఐ తేల్చి చెప్పేసింది.
దుబాయ్‌లో టీమిండియా ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీనే ఫస్ట్ బ్యాటింగ్ దిగాడు. నెట్స్‌లో కోహ్లీ, రోహిత్.. మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. మరోవైపు, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్ మాత్రం అడ్డదిడ్డంగా షాట్లు ఆడుతూ సపోర్ట్ స్టాఫ్‌కు టెన్షన్ పెట్టారు. వామ్మో వీళ్లేంటి ఇలా ఆడుతున్నారని వాళ్లు కూడా అలెర్ట్ అయ్యారు.
ఇండియా తన ఛాంపియన్స్ ట్రోఫీ యాత్రను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌తో స్టార్ట్ చేస్తుంది. ఇక అందరూ వెయిట్ చేస్తున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. ఇండియా ఆడే మ్యాచులన్నీ దుబాయ్‌లోనే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి