ఏంటి 14 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్య వంశీ నిజంగానే ఆ హాట్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారా.. ఇంతకీ వైభవ్ సూర్య వంశీ ఏ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారు అనేది ఇప్పుడు చూద్దాం.. ఈసారి ఐపీఎల్ లో అతిపిన్న వయసున్నటువంటి వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ లో ఆడిన సంగతి మనకు తెలిసిందే.వైభవ్ సూర్యవంశీ ఏజ్ కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. అలాంటిది 14 ఏళ్ల వయసులోనే సెంచరీ కొట్టి హాట్ టాపిక్ గా మారిపోయారు. అయితే అలాంటి వైభవ్ సూర్య వంశీ లక్నోతో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చారు.అలా ఈయన ఐదు మ్యాచ్ లు ఆడి దాదాపు 155 రన్స్ చేశారు.అలాగే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించారు. 

అయితే అలాంటి వైభవ్ సూర్యవంశీ మీద తాజాగా సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. సీబీఎస్ఈ లో చదువుతున్న ఈయన పదో తరగతి ఫెయిల్ అయ్యాడు అంటూ సోషల్ మీడియాలో చాలామంది ప్రచారం చేస్తున్నారు. కానీ వైభవ్ సూర్య వంశీ అసలు పరీక్షలై రాయలేదని అవన్నీ దుష్ప్రచారాలు అని వాటిని నమ్మకండి అంటూ కొట్టి పారేస్తున్నారు. అంతేకాకుండా వైభవ్ సూర్యవంశీ పర్సనల్ లైఫ్ గురించి కూడా కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వైభవ్ సూర్యవంశీ ఓ హాట్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారని, ప్రపోజ్ కూడా చేసినట్టు సోషల్ మీడియాలో ఒక రూమర్ వినిపించడంతో ఈ రూమర్ వార్తలపై వైభవ్ సూర్యవంశీ పేరెంట్స్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన తన కొడుకు పై ఇలాంటి రూమర్లు చేయడం తగదు అంటూ మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అతి చిన్న వయసులో తన బ్లాస్టింగ్ బ్యాటింగ్ తో సెంచరీలు చేస్తూ అందర్నీ అబ్బుర పరుస్తున్నారు వైభవ్ సూర్యవంశీ.

మరింత సమాచారం తెలుసుకోండి: