* ప్రారంభంలో డీవై పాటిల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే మ్యాచ్ జరుగుతున్న కొద్ది స్పిన్నర్లకు తోడ్పాటునిస్తుంది.
* బౌండరీలు: స్ట్రెయిట్ బౌండరీలు చిన్నవిగా ఉండటం వల్ల బ్యాటర్లు సిక్సర్లను లక్ష్యంగా చేసుకుంటారు.
* వాతావరణం: రాత్రిపూట మంచు ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు చేజింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది.
* ఇండియా బలమైన స్పిన్ :
భారత జట్టు టోర్నమెంట్‌లో సరైన సమయంలో ట్రాక్ లోకి వచ్చింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయినా.. అనూహ్యంగా పుంజుకుని న్యూజిలాండ్ తో పాటు ఆస్ట్రేలియాతో సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు వచ్చింది. ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉండడంకు ఇండియాకు బలం.
* బ్యాటింగ్ వ్యూహం: అనుభవజ్ఞులైన ఓపెనర్లు పవర్‌ప్లేలో స్థిరంగా ఆడి, ఆ తర్వాత మధ్య ఓవర్లలో వేగం పెంచాలి. మిడిల్ ఓవర్లలో దూకుడుగా ఆడే బ్యాటర్లు ఇండియా జట్టులో ఉన్నారు.
* బౌలింగ్ వ్యూహం: భారత స్పిన్నర్లు కీలకమైన 11 - 35 ఓవర్లలో పరుగులు కట్టడి చేసి, వికెట్లు తీయడంలో కీలకం. డెత్ ఓవర్లలో (చివరి 10 ఓవర్లలో) యార్కర్లు, స్లో బాల్స్‌తో పరుగులు ఇవ్వకుండా బౌలింగ్ చేయాలి.
* ఫస్ట్ బ్యాటింగ్ వస్తే
టీం ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే 250 - 275 మధ్యలో పరుగులు చేయాలి.
* దక్షిణాఫ్రికా ఫేస్ :
దక్షిణాఫ్రికా జట్టు టోర్నమెంట్‌లో తమ పట్టుదలను ప్రదర్శించింది. వారి బలం కొత్త బంతితో పేస్ బౌలింగ్ మరియు అద్భుతమైన ఫీల్డింగ్.
* బౌలింగ్ వ్యూహం: దక్షిణాఫ్రికా పేసర్లు కొత్త బంతితో పవర్‌ప్లేలో భారత టాప్-ఆర్డర్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపే ప్లాన్‌లో ఉంటారు.
* బ్యాటింగ్ వ్యూహం:
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ యూనిట్ టార్గెట్‌ను చివరి వరకు తీసుకెళ్లి గెలవడానికి ప్రయత్నిస్తుంది. ఒత్తిడిలో కూడా ధైర్యంగా ఆడగల టాలెంట్ వారికి ఉంది.
* ఫీల్డింగ్ :
ఇండియా క్రికెటర్లు ఫైనల్లో అద్భుతంగా ఫీల్డింగ్ చేయాలి. బౌండరీలను ఆపి డైరెక్ట్ హిట్‌లు చేస్తే 20 - 25 పరుగులు ఆపాలి.
* ఛేజింగ్ :
ఇండియాకు ఛేజింగ్ వస్తే రన్ రేట్ 5 కు పైగా 6 వరకు తగ్గకుండా చూసుకుని .. చివర్లో 10 ఓవర్లు వేగంగా ఆడాలి.
* దక్షిణాఫ్రికా బౌలర్లు పవర్ ప్లేలో 2 వికెట్లు తీస్తే.. వారు స్టార్టింగ్‌లో పై చేయి సాధించినట్లు అవుతుంది. ఒకవేళ ఇండియా స్పిన్నర్లు 15 - 30 ఓవర్ల మధ్యలో ఎక్కువ వికెట్లు తీస్తే మ్యాచ్ మనకు ప్లస్ అవుతుంది.
* ఫైనల్‌లో ఎవరు గెలుస్తారనేది టాస్ మరియు పిచ్ పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
* స్పిన్‌కు అనుకూలిస్తే: భారత్‌కు స్వల్ప ఆధిక్యం ఉంటుంది.
* ఒక వేళ మంచు ప్రభావం ఉంటే... ఛేజింగ్ లో అనుభవంతో పాటు కొత్త బంతితో బౌలింగ్ కారణంగా దక్షిణాఫ్రికాకు ఫ్లస్ అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి