స్టార్ మా ఛానల్ మోనాల్ మరియు అఖిల్ కి సంబంధించి ఇటీవల ఓ ప్రోగ్రాం ప్రోమోను కూడా విడుదల చేసింది. అసలు విషయానికొస్తే.. స్టార్ట్ మ్యూజిక్' ప్రోగ్రాం మూడో సీజన్ త్వరలో స్టార్ మాలో ప్రసారం కానున్న నేపథ్యంలో ఇందులో, బిగ్బాస్ కంటెస్టెంట్లు పాల్గొని కనువిందు చెయ్యబోతున్నారట. తాజాగా ఈ ప్రోగ్రాం లో అఖిల్ పాల్గొన్న ప్రోమోను స్టార్ మా సిబ్బంది విడుదల చేసింది. ఆ ప్రోమోలో మోనాల్ వాయిస్ తో "అఖిలూ.. నన్ను మిస్ అవుతున్నావా? కళ్లు మూసుకో" అంటూ వినిపిస్తుంది. మొత్తానికి వీరిద్దరు కలిసి ఏదో చేస్తున్నారు. అదేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..