ఇంటర్వ్యూలో శ్రీ రాముడి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశమంతా పూజించే దేవుడిపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మోనాల్ గజ్జర్. ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు నీకు శ్రీ రాముడి గురించి ఏం తెలుసు.. దేవుడి గురించి నోరు పారేసుకునేంత గొప్ప దానివి అయిపోయావా అంటూ నిలదీస్తున్నారు. ఏ హక్కు ఉందని రాముడి గురించి మాట్లాడావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. భార్యను అడవుల పాలు చేసాడంటూ చెప్పుకొచ్చింది.. అవి వైరల్ అయ్యాయి.