మొదటి 7. 30 గంటలకు పిన్ని 2 సీరియల్‌ను ప్రారంభించారు. మెల్లిగా సీరియల్ పిక్ అప్ అయ్యే సమయానికి స్లాట్ మార్చేశారు. ఇప్పుడు రాత్రి పదిగంటలకు ప్రసారం చేస్తున్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే.. ఆ సీరియల్ నుంచి ఆమె తప్పుకుంది. ఆ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అన్ని రకాల ఎమోషన్స్ కలిసి వస్తున్నాయి.. సన్ టీవీ వారితో నేను ఎన్నో యేళ్లుగా ట్రావెల్ అవుతూ వచ్చాను.. ఎంతో కష్టపడ్డాను.. కానీ నా టెక్నీషియన్స్, సహనటులకు బై చెప్పాలంటే బాధగా ఉంది. అయితే ఈ సీరియల్ మాత్రం ముందుకు తీసుకెళ్లండి.. నా ఫ్యాన్స్, శ్రేయోభిలాషులకు అందరికీ లవ్యూ.. మీరు కురిపించిన ప్రేమ, విధేయతకు థాంక్స్.. చిట్టి 2 సీరియల్‌ను చూస్తూనే ఉండండి.. అంటూ రాధిక ఎమోషనల్ అయింది... ఎందుకు ఆమె తప్పుకుంది. అనే విషయం పై క్లారిటీ అయితే రాలేదు..