బిగ్ బాస్ ఉత్సవం ఇలా స్పెషల్ ప్రోగ్రాంలోనూ అవినాష్, అరియానాలు బాగానే హల్చల్ చేశారు. అయితే దివి మాత్రం అంతగా ఫోకస్ అవ్వడం లేదు. అయితే దివి మాత్రం సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. బుల్లితెరపై మాత్రం దివి ఎక్కువగా హడావిడి చేయదు.. ఇది ఇలా ఉండగా తాజాగా వదిలిన ప్రోమోలో అరియానాకు తొందర ఎక్కువ అని సుమ కామెంట్ చేస్తే.. దివి అందం ఎక్కువ అని అవినాష్ తన పులిహోరను మళ్లీ కలపడం ప్రారంభించేశాడు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలోనూ అవినాష్ దివితో బాగానే కెమిస్ట్రీ కలిపాడు. దివి అందాని సోషల్ మీడియా మొత్తం ఫిదా అయిన సంగతి తెలిసిందే... మెగా ఫ్యామిలీ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది.