బిగ్ బాస్ వల్ల వచ్చిన ఇమేజ్ను చక్కగా వాడకుని ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేయాలని అభిజిత్ బాగా ప్రయత్నిస్తున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా తరువాత మళ్లీ అభిజిత్ తెరపై కనిపించలేదు. అందుకే ఇలా బిగ్ బాస్ ఇమేజ్‌తో మంచి హిట్ కొట్టేసి స్టార్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.వెయిట్ చేస్తున్నాడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచీ అభిజిత్ తనకు సరిపోయే కథ, స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నట్టు చెప్పాడు.రోజంతా కూర్చుని కథలు వింటూ ఉండేవాడట. కంటిన్యూగా రెండు మూడు గంటలు కథలు వింటూ ఉన్నానని సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నానని అభిజిత్ తెలిపాడు.