లేడీ జడ్జ్‌లతో మాస్, రొమాంటిక్ పర్ఫామెన్స్ చేస్తూనే అందరి మీద పంచ్‌లు వేసేశాడు. డ్యాన్స్ ప్లస్ అంటూ వస్తోన్న ఈ షోలో బాబా భాస్కర్ ఇచ్చే జడ్జ్మెంట్, తన కంటెస్టెంట్లతో వేసే మాస్ స్టెప్పులు, తోటి జడ్జ్‌లైన మోనాల్, ముమైత్, యానీ మాస్టర్లతో రచ్చ చేస్తున్నాడు.. అయితే ఇప్పుడు మాస్టర్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ లో గెస్ట్ గా వచ్చారు. వచ్చే ఆదివారం ప్రసారం కానున్న కామెడీ స్టార్స్‌లో బాబా భాస్కర్ సందడి చేయబోతోన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రోమోను వదిలారు. ఇందులో బాబా మాస్టర్ హైలెట్ అయ్యాడు.