వంటలక్క పేరు తెలియని వారు ఎవరు  ఉండరు.ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. బుల్లితెరలో ప్రసారమయ్యే టీవీ సీరియల్స్ లో టాప్ రేటింగ్ ఉన్న సీరియల్ ఏదంటే  మా టీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం అనడంలో అతిశయోక్తి లేదు.. అంతగా దీప ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఎప్పుడు సీరియల్స్ లోనే చూసే ఈ వంటలక్కను ఇప్పుడు ఒక ఈవెంట్ లో కూడా చూడబోతున్నారు. మాములు గెస్ట్ గా కాదండోయ్... ఒక అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్ తో దసరాకి మన ముందుకు రాబోతుంది. పండగ వచ్చిందంటే చాలు టీవీ ఛానెల్స్ వాళ్ళు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి ఇలా స్పెషల్ పండుగలు వచ్చినప్పుడల్లా  డిఫరెంట్ టైప్స్ ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులను అలరిస్తారు.



ఏ టీవిలో ప్రోగ్రామ్ చూడాలో అర్ధం కాక ప్రేక్షకులు తికమక పడుతుంటారు. వీటిలో ముఖ్యంగా ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా చానెల్ వాళ్లు పోటీ పడుతుంటారు. ఒకరిని మించి మరొకరు వెరైటీగా ఈవెంట్లను ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ దసరాకు బుల్లితెర మోత మోగనుంది.పండగ ఈవెంట్ ప్లాన్ చేయడంలో  ఈటీవీ ముందు ఉంటుంది.ఈ ఈవెంట్ లో జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు రచ్చ చేయాల్సిందే. జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు, సింగర్లు, స్పెషల్ టాలెంట్ ఉన్నవాళ్లు ఇలా ఎంతో మందిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి సందడి చేస్తుంటారు. ఈ దసరాకు అక్కా ఎవరే అతగాడు.. అంటూ హీరోయిన్ సంగీతను రంగంలోకి దింపారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమో ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటుంది..ఇదిలా ఉంటే మేము ఎమన్నా తక్కువా... అని మా టీవీ వాళ్ళు కూడా ఒక డాన్స్ ప్రోమోను రిలీజ్ చేసారు.



ఈవెంట్ లో స్టార్ మా సీరియల్ నటీనటులు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు  సందడి చేయనున్నారు. అయితే ఈ సారి  ఈవెంట్ మాత్రం "మునుపెన్నడూ చుడనిది.. చుసిన మరువనిది " అనేలా  ఉండబోతోంది. ఎందుకంటే ఈసారి స్టార్ మా వాళ్ళు మన వంటలక్కని రంగంలోకి దింపారు.. సాధారణంగా మనం దీపను సీరియల్ లో తప్పా బయట వేరే ఈవెంట్లలో చూడడం అరుదు. సర్వసాధారణంగా రాదు. కానీ మొదటి సారిగా ఇలా ఓ ఈవెంట్‌లో రచ్చ చేసేందుకు వచ్చింది.జాతరో జాతర అంటూ స్టార్ మా వాళ్లు దసరా ఈవెంట్ చేస్తున్నారు. ఇందులో అమ్మోరుగా తన విశ్వరూపాన్ని చూపెట్టేందుకు వంటలక్క సిద్దమైంది. అమ్మ వారుగా ప్రేమీ విశ్వనాథ్ అదిరిపోయేలా నటించింది.సాక్షాత్తు అమ్మవారిని చూసినట్లు అనిపంచేలా ఉంది మన వంటలక్క.ఈ ఈవెంట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు..ఈవెంట్ సంగతి పక్కన పెడితే దీప డాన్స్ కోసం ఈవెంట్ చూసే వాళ్లే ఎక్కువగా ఉండొచ్చు..ఇక ఈ దెబ్బతో మన వంటలక్క రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: