తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ చివరి దశకు చేరుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో ఇదే బిగ్ బాస్ హౌజ్ లో ఆఖరి కెప్టెన్సీ పోటీ అంటూ క్లారిటీ ఇస్తూ అనౌన్స్ చేసేసారు బిగ్ బాస్. అటు హౌస్ లో చివరి కెప్టెన్ గా గుర్తింపు పొందేందుకు హౌస్మేట్స్ పోటీ పడుతుండగా ఇటు గ్రాండ్ ఫైనల్ కోసం బిగ్బాస్ టైటిల్ ని ముస్తాబు చేస్తున్నారు. ఈ స్టేజ్ ని అద్భుతంగా అదిరిపోయేలా డిజైన్ చేసేందుకు లక్షలు కుమ్మరిస్తున్నారట బిగ్ బాస్ టీమ్. అంతేకాదు బిగ్ బాస్ ఫినాలే కోసం స్టేజ్ పై చిందులు వేసి సందడి పెంచేందుకు క్రేజీ హీరోయిన్లను బరిలోకి దింపనున్నారట. ఈ ఏర్పాట్ల కోసం వారికి కోట్లు చెల్లించేందుకు సిద్దమైనట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లను సెలెక్ట్ చేసి ఒప్పందం కుదుర్చుకుందట బిగ్ బాస్ యాజమాన్యం. ఈసారి బిగ్ బాస్ ఫినాలే స్టేజ్ కళ్ళు జిగేలుమనేలా ఉండబోతోందట. ఇక హౌజ్ లో 12 వారం నామినేషన్ లో కెప్టెన్ గా ఉన్న ఒక్క మానస్ తప్ప మిగిలిన సన్నీ, రవి, షణ్ముఖ్,  శ్రీరామ్, కాజల్, ప్రియాంక, సిరి లు నామినేషన్ లో ఉన్నారు. సన్ని ఓటింగ్ తో దూసుకు పోతూ ఉండగా షన్ను రెండవ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మూడవ స్థానం లో రవి, ఆ తర్వాత  శ్రీ రామ్, ఆ తర్వాత అయిదవ స్థానంలో సిరి ఉన్నారు.

ఇక మిగిలింది మానస్, ప్రియాంక మరియు కాజల్ లు. అయితే మానస్ ఎలాగో కెప్టెన్ కాబట్టి ఈవారం సేవ్ అయిపోతారు. ఇక మిగిలిన ప్రియాంక, కాజల్ లలో పింకీ ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం చాలా ఇంపార్టెంట్ అందుకే అందరూ టాస్క్ లలో జోరుగా పాల్గొంటూ గెలవడానికి 100 శాతం శ్రమిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: