ప్రస్తుతం జబర్దస్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకొని ప్రముఖ యాంకర్ అనసూయ సినిమాలలో వరుసగా అవకాశాలు అందుకోవడమే కాదు ఇప్పుడు పాన్ ఇండియా నటిగా కూడా మంచి పేరు దక్కించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు అంతకుమించి అవకాశాలు లభిస్తున్నాయనే చెప్పాలి. బుల్లితెరపై పోల్చుకుంటే వెండితెరపై పూర్తిస్థాయిలో అవకాశాలను అందుకుంటూ మరింత స్టార్ పొజిషన్ కి చేరుకుంది.
ఇక సుడిగాలి సుదీర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆ తర్వాత యాంకర్ గా కూడా పనిచేసే ఇప్పుడు హీరోగా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఇప్పటికే మూడు సినిమాలలో హీరోగా నటించిన సుధీర్ ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
వేణు కూడా జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత సినిమాలలో కమెడియన్ గా పనిచేసి ఇప్పుడు బలగం సినిమా ద్వారా దర్శకుడిగా మారి తనలో సత్తా చాటారు. ఒక దర్శకుడిగా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు వేణు.
ఇప్పుడు ఈ జాబితాలోకి తాజాగా మరొక కమెడియన్ కూడా చేరిపోయారు. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శాంతి కుమార్ కూడా దర్శకుడిగా మారారు ఆది సాయికుమార్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో శాంతి కుమార్ దర్శకుడిగా ఏ విధంగా సక్సెస్ అవుతారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి