ప్రస్తుతం స్టార్ మా చానల్లో ప్రేక్షకులను బాగా అలరిస్తున్న ఎన్నో సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న మానస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న కావ్య తన అందంతో నటనతో అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తన నటనతో అందరినీ మెప్పిస్తున్న ఈమె గురించి తెలుసుకోవడానికి బుల్లితెర సీరియల్ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి నేడు కావ్య రియల్ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.

కావ్య అసలు పేరు దీపిక రంగరాజు. తమిళనాడులో  సెప్టెంబర్ 29వ తేదీన దీపికా రంగరాజ్ జన్మించారు. ఇక ఈమె తమిళమ్మాయి ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న దీపిక రంగరాజ్ సినిమా షూటింగ్ నిమిత్తం మాత్రమే ఇక్కడికి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈమె ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే.. శ్రీ ఆండాళ్ అలగార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్లో ఈసీఈ పూర్తి చేశారు. ఇక చదువు పూర్తయిన వెంటనే ఈమె న్యూస్ రీడర్ గా పనిచేసే ఆ తర్వాత నటన మీద ఆసక్తి పెంచుకొని.. తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఇక పలు తమిళ సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటించిన దీపికా రంగరాజు అక్కడ కూడా తన అందంతో నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రస్తుతం ఆమెకు తమిళ సినీ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ తో పాటు అంతకు మించిన క్రేజ్ కూడా ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. అక్కడితో ఆగకుండా అవకాశం వచ్చిన ప్రతి యాడ్ లో కూడా కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయింది దీపిక. ఇక అక్కడ తమిళ్లో మంచి గుర్తింపు రావడంతో తెలుగులో కూడా నటించే అవకాశం రాగా.. అలా స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో అవకాశం దక్కించుకుంది. అలా తొలి తెలుగు సీరియల్ బ్రహ్మముడిలో అవకాశం దక్కించుకొని మొదటి సీరియల్ తోనే మంచి ప్రేక్షకు ఆదరణ సొంతం చేసుకుంది దీపికా రంగరాజు.

మరింత సమాచారం తెలుసుకోండి: