తెలుగు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ నటి రీతూ చౌదరి కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా పలు రకాల వాటిని తెలియజేస్తూ ఉంటుంది. తన తండ్రి మరణ విషయాన్ని కూడా చాలా బాధ పెట్టింది అంటూ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయింది రీతూ చౌదరి.. గతంలో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె పలు రకాల టీవీ షోల ద్వారా మంచి క్రేజ్ అందుకుంది.



జబర్దస్త్ షో వల్ల ఈమెకు మరింత క్రేజ్ పెరిగిపోవడంతో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్స్ భారీగానే పెరిగిపోయారు. ఇటీవల ఈ  అమ్మడు తన తండ్రి గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ కావడం జరిగింది. రీతు చౌదరి తన నానమ్మ సంవత్సరకాలం  పూర్తి చేయడం కోసం తన కుటుంబంతో కలిసి ఊరికి వెళ్ళిందట. ఆ సమయంలో తన తండ్రి చాలా సరదాగా ఉండేవారని.. తనని కూడా యూట్యూబ్లో యాక్టివ్ గా ఉండమని తన ఊరి గురించి ఒక వీడియో తీయమని చెప్పారట.



అయితే రాత్రి మాట్లాడి తెల్లారేసరికి చనిపోయారని ఈ విషయం తెలిసి చాలా ఎమోషనల్ అయ్యానని తెలియజేసింది. తన ఫస్ట్ జితం తో కొన్న కారులో తన తండ్రి శవాన్ని ఇంటికి తీసుకురావడం తనకి చాలా బాధను కలిగించిందని ఆకారులో ఎప్పుడు కూర్చున్నా కూడా తనతో ఉన్నట్టుగానే ఫీల్ అవుతానని తెలిపింది రీతూ చౌదరి.. అయితే తన తండ్రి మరణాన్ని అన్నయ్య కూడా జీర్ణించుకోలేక చాలా మౌనంగా ఉండిపోయారని తెలిపింది. తండ్రి లేని బాధను తీర్చడం కోసం కుటుంబ బాధ్యతలను తాను తీసుకున్నారని తన తండ్రి శవం మీద ప్రామిస్ చేసినట్లు రీతూ చౌదరి తెలిపింది.. తన తల్లి ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి వచ్చారని ప్రస్తుతం నటిగా కూడా కొనసాగుతున్నానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: