తెలుగు బుల్లితెరపై అతిపెద్ద కామెడీ షో గా మంచి పాపులారిటీ సంపాదించినటువంటి షోలల జబర్దస్త్ షో కూడా ఒకటి.. దాదాపుగా 10 సంవత్సరాలకు పైగా ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. ఈ షో నుంచి ఎంతో మంది కమెడియన్స్ సినీ ఇండస్ట్రీలో హీరోలుగా కమెడియన్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. అయితే యాంకర్లుగా మాత్రం ఎంతో మంది వస్తున్నప్పటికీ అనసూయ, రష్మీ ని మించి ఎవరు చేయలేకపోతున్నారని చెప్పవచ్చు. జడ్జిలుగా రోజా నాగబాబు తప్ప మరెవరు కూడా అంతగా ఆకట్టుకోలేక పోతున్నారు.


అందుచేతనే ఈ షోలను గత కొద్ది రోజులలో మూసేస్తున్నారని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ షోలో గత కొన్ని నెలల క్రితం యాంకర్ గా సౌమ్యరావుని అనసూయ స్థానంలో తీసుకురావడం జరిగింది. కన్నడ బుల్లితెర నుంచి సౌమ్యా రావు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమెకు వచ్చి రాని తెలుగుతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది అయితే ఉన్నఫలంగా ఈమెను ఈ షో నుంచి తప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సౌమ్య రావు జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో పలు రకాల సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎందుకు ఈ షో నుంచి తప్పుకుంది సౌమ్యారావు అనే విషయంపై అభిమానులు సెర్చింగ్ చేయగా.


సౌమ్య వ్యవస్థానంలో బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సిరి హనుమంతు యాంకర్ గా చేస్తున్నది.. సౌమ్యారావు అభిమానులకు అందిన సమాచారం ప్రకారం.. సౌమ్యారావ్ జబర్దస్త్ నుంచి బయటికి రావడం వెనుక ఏదో పెద్ద ప్లాన్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సౌమ్యరావును కావాలనే జబర్దస్త్ షో నుంచి తప్పించారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. మరి ఈ విషయంపై సౌమ్యరావు ఏవిధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సిరి హనుమంతు కూడా యాంకర్ గా బాగానే సెటిలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. మరి యాంకర్ గా ఈమె అయిన ఎన్నేళ్లు చేస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: