తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఉదయభాను కూడా ఒకరు. సుమ, ఝాన్సీ ఇతరత్ర యాంకర్స్ రాకముందే ఉదయభాను యాంకర్ గా భారీ క్రేజ్ ను అందుకుంది. అయితే ఇటీవలే జీ తెలుగులో గోల్డెన్ లేడీ ఆఫ్ అంటూ ఉదయభాను రీ ఎంట్రీ ని చాలా గ్రాండ్గా తెలియజేశారు.అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల అయింది. గతంలో ఎన్నో షోలకు యాంకర్ గా చేసిన ఉదయభాను ఒక్కసారిగా కెరియర్ వెనక్కి వెళ్లిపోవడానికి ఎన్నో కారణాలు సైతం ఉన్నాయి.రేలారే రేలారే ప్రోగ్రాం లో.. గత్తర కొడుకులు గాడిద కొడుకులు అంటూ ఒక పాట పాడిన తర్వాత ఈమెకు అసలు ఛాన్స్లే రాలేదట.. అంతేకాకుండా ఈమె పైన ఈ పాట తరువాత చాలా కక్ష పెరిగిపోయి తొక్కేసారని ఇండస్ట్రీలో గతంలో రూమర్స్ వినిపించాయి. అయితే ఆ సమయంలో ఉదయభాను ఈ చిన్న విషయంలో తనని ఈ షో నుంచి తీసేయాలని ఎవరో చెప్పిన మాట విని టీవీ ప్రోగ్రాంకి  తనని తీసేసి అంత టైం ఎవరికి ఉండదంటూ కూడా తెలియజేసింది.. అంతేకాకుండా ఉదయభాను జీవితంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంది.


ఉదయభాను చిన్న వయసులోనే తన తల్లి కోరిక మేరకు వివాహాన్ని చేసుకుంది. అయితే ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో విడాకులు కూడా తీసుకుంది. ఆ తర్వాత టీవీ షోలో బిజీ గా అయిపోయి విజయ్ అనే వ్యక్తిని మళ్లీ ప్రేమించి వివాహం చేసుకుంది. వారి మధ్య కొన్ని అనేక సమస్యలు రావడంతో తన తల్లితో కూడా ఉదయభాను మాట్లాడేది కాదు.. ఇలా ఎన్నో వ్యక్తిగత సమస్యల వల్ల సతమతమవుతున్న సమయంలో కొత్త యాంకర్స్ రావడంతో అనేక షోలు చేయడం వల్ల వారికి క్రేజ్ పెరగడంతో ఉదయభాను మాట్లాడించేవారే లేరు. దీంతో పాటు వయసు కూడా మిద పడడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఇద్దరి పిల్లలు తల్లి అయిన తర్వాత ఉదయభాను మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: