
కీర్తి భట్ తన దగ్గర లక్షల రూపాయలు అప్పు చేసిందని అవి తిరిగి ఇవ్వకుండా మోసం చేసిందని అందువల్లే చంద్రశేఖర్ ఆమె ఎంగేజ్మెంట్కు కూడా రాలేదనే విధంగా వార్తలు వినిపించాయి.. వీటన్నిటి పైన చంద్రశేఖర్ క్లారిటీ ఇస్తూ..కీర్తి భట్ ఒక్కరే కాదు తన దగ్గర చాలామంది డబ్బులు తీసుకొని అబద్ధాల వల్ల మోసపోయానని తెలిపారు.తాను సీరియల్ ద్వారా సంపాదించిన దానికంటే అప్పులు చేసిందే ఎక్కువ అంటూ వెల్లడించారు.
కీర్తి భట్ తో తనకు మంచి బాండింగ్ ఉండేదని ఇటీవలే ఆమెను కలిశాను చాలా రోజుల తర్వాత తన ఫోన్ నెంబర్ తీసుకుందని.. అయితే తనని ఇంతకు ముందులా లేవని చెప్పింది.. కానీ కీర్తి భట్ నడిచే దారి వేరే వైపుగా ఉండడంతో తన దారి మారిందని తెలిపారు నటుడు చత్రపతి శేఖర్. అయితే పర్సనల్ విషయాలలో ఎప్పుడూ కూడా ఒకరినొకరు ఇన్వాల్వ్ కాలేదని.. కీర్తి భట్ కి తల్లిదండ్రులు లేరు కాబట్టి తనని నాన్నగా ఫీల్ అయ్యేదని తాను కూడా కూతురు లాగానే చూసుకున్నానని తెలిపారు. షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను అని తెలిపారు.
అయితే ఆ తర్వాత ఫోన్ చేసినా కూడా తాను లిఫ్ట్ చేయలేదని తెలిపారు నటుడు శేఖర్.. ఇక డబ్బులు విషయం వస్తే .. తన దగ్గర అబద్ధం చెప్పి నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నదని అయితే తాను డబ్బులు తీసుకున్నందుకు బాధ కాదు కానీ అబద్ధం చెప్పినందుకే బాధ వేస్తోంది అంటూ తెలిపారు. సీరియల్ లో నటిస్తున్న సమయంలో కూడా తనని జాగ్రత్తగా ఉండమని ఎన్నోసార్లు సూచించానని తెలిపారు నటుడు చత్రపతి శేఖర్.