
మొదటిసారి మా అమ్మకి ఒకసారి ఇచ్చాను మా అమ్మ తర్వాత ఇప్పుడు మీకే ఇస్తున్నాను అంటూ యాంకర్ శ్రీముఖికి స్టేజి పైన ఒక చీర తీసుకువచ్చి గిఫ్ట్ గా ఇస్తారు బాలు.. అయితే ఈ చీరలో స్పెషాలిటీ ఏముందనుకునే విషయానికి వస్తే.. ఈ చీరని స్వయంగా బాలునే నేయడం జరిగింది. అందుకు సంబంధించిన వీడియోను కూడా చూపించారు. ఈ విషయం తెలియగానే శ్రీముఖి కూడా తెగ సిగ్గు పడిపోయి మరి ఆ చీరని తీసుకుంది..అక్కడ ఉన్న కొంతమంది సెలబ్రిటీలు ప్రశంసించారు. అలాంటి సమయంలోనే మరొక నటి మీనా తో శ్రీముఖి ఇలా అంటూ మీనా నీ బాలు నాకోసం చీర నేశాడు అంటూ చాలా హ్యాపీగా చెబుతుంది.
దీంతో మీనా కూడా బాగుంది కానీ ఇంత మంచి సర్ప్రైజ్ ఇస్తారని తాను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటు తెలియజేస్తుంది. ఆ తర్వాత జబర్దస్త్ రోహిణి కూడా ఇంతటి హార్డ్ వర్క్ చేసి చీర ఇవ్వడం అనేది కూడా గ్రేట్ అంటూ మెచ్చుకుంటుంది. ఇలా అందరూ మెచ్చుకోవడంతో శ్రీముఖి ఈ చీర ఇచ్చినందుకు బాలుకి స్పెషల్ థాంక్స్ చెబుతోంది. ఇది నాకి చాలా స్పెషల్.. పైగా మీరు మీ చేతులతో నేసిన చీర కాబట్టి మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది అంటూ తెలియజేస్తుంది శ్రీముఖి. మొత్తానికి ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో మాత్రం వైరల్ గా మారుతున్నది.