మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్ లాంఛ్..ఇన్ సిరీస్‌లో ఇన్ నోట్ 1ఏ, ఇన్ 1బీ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. వీటిలో మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1కు సంబంధించిన సేల్ మనదేశంలో ఈరోజు జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్‌లో ఈ సేల్ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో లాంచ్ అయింది..ధర రూ.12,499గా ఉంది. గ్రీన్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. చైనా బ్రాండ్లకు ఈ ఫోన్ గట్టి పోటీ ఇస్తుంది..సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంది