పర్సనల్ కంప్యూటర్లు, మినీ ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చింది నోకియా. కానీ తర్వాత మార్కెట్ లో పోటీ దృష్ట్యా తిరోగమనాన్ని చూసింది. నోకియా బ్రాండ్ నుంచి వచ్చిన చివరి మినీ ల్యాప్‌టాప్ నోకియా బుక్లెట్ 3జీ ఇది 2009లో వచ్చింది. ఇప్పుడు తాజాగా భారతదేశంలో కొత్త సిరీస్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనున్నట్లు మార్కెట్ లో వార్తలు గుప్పుమన్నాయి.నోకియా బ్రాండ్‌తో హెచ్ఎండి గ్లోబల్ సంస్థకు చెందిన ల్యాప్‌టాప్‌లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్సైట్లో ప్రత్యేక గుర్తింపు కోసం అభ్యర్థన కోసం ఆఫ్లికేషన్ ను పెట్టుకున్నట్లు తెలుస్తుంది..