స్కల్‌క్యాండీ అధిక బ్యాటరీ లైఫ్‌తో 'జిబ్ ట్రూ' ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వాటర్ రెసిస్టెంట్, డ్యూయల్ మైక్రోఫోన్స్‌తో యూజర్స్ అద్భుతమైన కాలింగ్ అనుభూతిని పొందుతారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్ బడ్స్ జెడ్, రెడ్మీ ఇయర్‌బడ్స్, రియల్మీ బడ్స్ క్యూలకు పోటీగా స్కల్‌క్యాండీ వీటిని తీసుకొచ్చింది.వాయిస్ కాల్స్, సౌండ్, ట్రాక్ ఛేంజ్ కోసం కంట్రోల్స్ ఇస్తున్నారు. నాయిస్ ఐసోలేషన్ కోసం సిలికాన్ టిప్ ఉపయోగించారు.