ఈ మధ్య ఎక్కువ మంది ఆన్ లైన్ లో ఏదోకటి వెతికినా కూడా డబ్బులు పోతున్నాయని వాపోతున్నారు.అందుకు కారణం కూడా లేకపోలేదు.. హ్యాకర్లు వారి అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. ఢిల్లీలో పనిచేసే ఒక ఉద్యోగి కేవలం నిమిషాల వ్యవధిలోనే రూ.80 వేలు పోగొట్టుకున్నాడు. కొరియర్ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్‌ను గూగుల్‌లో సెర్చ్ చేయడమే దీనికి కారణం. గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్లు సెర్చ్ చేయడం ఎంత ప్రమాదమో తెలియజేసే మరో సంఘటన ఇది.