స్మార్ట్ ఫోన్లలో స్టార్ ఫోన్ ఐఫోన్.. ప్రముఖ కంపెనీ యాపిల్ ఈ ఫోన్లకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఈ ఫోన్లకు మార్కెట్ లో మంచి టాక్ ఉంది.యాపిల్ ఫోన్ ను ఒక్కసారి అయిన వాడాలని జనాలు అనుకుంటారు. అందుకే స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేర్ లో ఆపిల్ ఏకంగా డబుల్ షేర్ ను సంపాదించుకుంది. డిసెంబర్ క్వార్టర్ కల్లా ముగిసిన సేల్స్ ను చూస్తే ఆపిల్ షేర్ గణనీయంగా పెరగటం విశేషం..ఇకపోతే గత ఏడాది అక్టోబర్ , డిసెంబర్ లలో ఐఫోన్ 11,ఐఫోన్ 12, ఐఫోన్ ఎక్సార్ ఫోన్లు భారీ స్థాయి లో అమ్ముడు పోవడంతో ఈ రికార్డును సొంతం చేసుకుంది.