ఇండియా ప్రముఖ బ్రాండ్ ఫోన్లలో ఒకటి నోకియా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్ కు మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి కొత్త ఫోన్లను విడుదల చేసింది. నోకియా 5.4, నోకియా 3.4 పేరుతో ఈ మోడల్స్‌ను తీసుకొచ్చారు. వీటితో పాటు నోకియా పవర్ ఇయర్‌బడ్స్ లైట్‌ని కూడా విడుదల చేశారు. ఇందులో నోకియా 5.4 మోడల్ మధ్యశ్రేణి, నోకియా 3.4 మోడల్ బడ్జెట్ శ్రేణి మార్కెట్ లక్ష్యంగా తీసుకొచ్చారు.