స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఏ12 స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది. గతేడాది మనదేశంలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ11కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ వచ్చింది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో అందించారు. రెడ్ మీ నోట్ 9 ప్రో, రియల్ మీ 7, ఒప్పో ఏ52 స్మార్ట్ ఫోన్లకు ఈ ఫోన్ గట్టిపోటీను ఇస్తుంది.