స్మార్ట్ ఫోన్లలో రెడ్ మ్యాజిక్ 6 ప్రోకి 18GB ర్యామ్ ఉంది. ఇలాంటి ఫోన్ ప్రపంచంలో ఇదే మొదటిది. ఈ ఫోన్ మీ సొంతమైతే... ప్రపంచంలోని ది బెస్ట్ యాక్షన్ గేమ్స్ అన్నీ ఈ అరచేతుల్లో కదులుతాయి...ఈ ఫోన్ పీచర్లను ఒకసారి పరిశీలిస్తే.. ఈ రెండు స్మార్ట్ ఫోన్లకూ అమోల్డ్ స్క్రీన్ ఉంది. రీఫ్రెష్ రేట్ 165 హెచ్ జెడ్ ఉంది. ఈ మొబైల్స్‌కి టచ్ కొరియోగ్రాఫర్ టెక్నాలజీ ఉంది.. ఇదో రకమైన ఇంటెలిజెంట్ అడాప్టివ్ టెక్నాలజీ. మీరు ఫోన్‌ను వాడే విధానాన్ని బట్టీ ఇది సరైన కచ్చితమైన రీఫ్రెష్ రేట్‌ని ఎంచుకుంటుంది. అందువల్ల చూడటానికి చక్కటి ఎక్స్‌పీరియన్స్‌తోపాటూ... బ్యాటరీ సేవ్ అవుతుంది.