స్పాట్ రోబో డాగ్ ధర సుమారు లక్ష డాలర్లు.ఈ రోబో డాగ్‌లు గంటకు మూడు మైళ్ల గరిష్ట వేగాన్ని అందుకోగలవు. అంతేకాకుండా వీటికి అమర్చిన 360 డిగ్రీల కెమెరాలతో వాటికి ఎదురయ్యే అడ్డంకుల నుంచి సులువుగా తప్పించుకోగలవు. సుమారు పద్నాలుగు కిలోల వరకు బరువును మోయగలవు. స్పాట్‌ను అత్యల్పంగా -20 డిగ్రీల సెల్సియస్ నుంచి, అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద ఆపరేట్ చేయవచ్చు. అంతేకాకుండా ఆయిల్, గ్యాస్ కంపెనీలో జరిగే లీకేజీలను కూడా ఇవి పసిగట్టగలవు. ఈ రోబో డాగ్‌లను పలు క్లిష్టమైన పనులకు ఉపయోగించవచ్చునని బోస్టన్ డైనమిక్స్ తెలిపింది.. ప్రస్తుతం డాగ్ లను మాత్రమే తయారీ చేశారు..