ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మి ఇప్పుడు ఎన్నో ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశారు. ఇప్పటికీ ఈ ఫోన్లకు మంచి డిమాండ్ ను అందుకున్నాయి. రెడ్ మీ నోట్ 10 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ సేల్ మనదేశంలో ఈరోజు జరగనుంది. నేడు మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, ఎంఐ.కాంలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. రెడ్ మీ నోట్ 10 సిరీస్ ఫోన్లలో హైఎండ్ మోడల్ ఇదే. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.