ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా వాడకం..ఆర్థిక లావాదేవీలు ఇతర పనులు అన్నింటికీ ఇప్పుడు ఇంటర్నెట్ ను వాడుతున్నారు. ఇక లాక్ డౌన్ సమయం నుండి ఇంటర్నెట్ వాడకం ఇంకా ఎక్కువైంది. లాక్ డౌన్ తో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించడం తో వారికి ఇంటర్నెట్ అవసరం కూడా పెరిగిపోయింది. టెలికాం సంస్థలు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికి ఆ డేటా సరిపోవడం లేదు. అంతే కాకుండా వినియోగదారులు పెరగటంతో ఇంటర్నెట్ స్పీడ్ కూడా తగ్గిపోయింది. కాగా ఎక్కువ డేటా అవసరం ఉన్నవారి కోసం బీఎస్ఎన్ఎల్ ఓ బంపరాఫర్ ను తీసుకువస్తుంది. అతి తక్కువ ధరకు రూ.299, రూ.399,రూ.555 ధరకే కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ ను అందిస్తుంది. ఈ ధరల కంటే ఎక్కువ ధరలకు కూడా బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ లో ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా తీసుకువస్తున్న ప్లాన్స్ 2021 మార్చ్ 21 నుండి అందుబాటులోకి రానున్నాయి.  

ఈ ప్లాన్స్ లో తక్కువ ధరకు లభిస్తున్న రూ.299 ప్లాన్ కింద 100 జిబీ డేటా ను అందిస్తున్నారు. 10 ఎంబీపీఎస్ హైస్పీడ్ తో ఈ డేటాను ఇవ్వనున్నారు. ఇక ఈ డేటా పూర్తయ్యాక కూడా 2 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు. ఇక రూ.555 తో ప్లాన్ వేసుకుంటే నెలకు 500 జిబీ డేటా వస్తుంది. 10 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఈ డేటా ను వాడుకోవచ్చు.  అయితే ఈ ప్లాన్స్ వేసుకోవాలంటే మాత్రం ఓ మెలిక పెట్టింది బీఎస్ఎన్ఎల్ ఇదేంటంటే...ఈ ప్లాన్స్ వేసుకోవాలంటే ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ తీసుకువచ్చిన ఈ ప్లాన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఎంతో ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇంటర్నెట్ ఎక్కువ వాడే వాళ్ళు కూడా మొబైల్ డేటా కంటే ఈ ప్లాన్ ను వేసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: