ఒప్పో కంపెనీ ఎన్నో రకాల ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆ ఫోన్లు అన్నీ కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి. ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఆ ఫోన్లు కూడా విడుదల కాక ముందే మార్కెట్ ను షేక్ చేస్తున్నాయి. ఆ ఫోన్లు ఎంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..


ఒప్పో తన ఏ-సిరీస్‌లో ఏ94 5జీ, ఏ54 5జీ అనే స్మార్ట్ ఫోన్లను రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒప్పో ఏ94లో 4జీ వేరియంట్ ఇప్పటికే యూఏఈలో లాంచ్ అయింది. ఇప్పుడు ఇందులో 5జీ వేరియంట్ గురించి కూడా వార్తలు వస్తున్నాయి. దీని ధర, రెండర్లు, స్పెసిఫికేషన్లు ఆన్ లైన్‌లో లీకయ్యాయి. దీంతోపాటే ఒప్పో ఏ54 5జీ వివరాలు కూడా లీకయ్యాయి. ఈ రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తాయని సమాచారం. వెనకవైపు నాలుగు కెమెరాలు, ముందువైపు హోల్ పంచ్ డిస్ ప్లే ఉండనున్నాయి.


ఈ ఫోన్లు త్వరలోనే లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను ఇందులో అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. మీడియాటెక్ హీలియో 800యూ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని స్టోరేజ్‌ను 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. డ్యూయల్ సిమ్ స్లాట్లు, బ్లూటూత్ వీ5.1, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.78 సెంటీమీటర్లుగానూ, బరువు 173 ఉండనుందని తెలుస్తుంది.. ఇక ధర విషయానికొస్తే..6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు. సుమారు రూ.17,300 నుంచి 26,000 వేల వరకు ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: