ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లు కొనాలని అందరూ అనుకుంటారు.. కానీ అన్నీ వున్న ఫోన్ ధరలు చూస్తె సామన్యుడు జేబులు ఖాళీ అవ్వాల్సిందే..ఇప్పుడు మన దేశంలో ఇలాంటి ఫొన్లకు మంచి డిమాండ్ వుంది.దీన్ని దృష్టిలో పెట్టుకొని వన్‌ప్లస్, రియల్‌మీ, శామ్‌సంగ్, షియోమి వంటి దిగ్గజ సంస్థలు ఆకట్టుకునే ఫీచర్లతో మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్నాయి. రూ.30 వేల ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తూ స్మార్ట్ఫోన్ ప్రియులను అట్రాక్ట్ చేస్తున్నాయి. గతేడాది ఇదే ధరల శ్రేణిలో వన్‌ప్లస్ వన్‌ప్లస్ నార్డ్‌ రిలీజైంది. ఈ ఫోన్ అతి కొద్ది రోజుల్లోనే గణనీయమైన అమ్మకాలను చూసిన విషయం తెలిసిందే. ఇక, వన్ప్లస్ నార్డ్కు పోటీగా ఇదే ధరల శ్రేణిలో శామ్‌సంగ్, షియోమి నుండి కూడా గతేడాది స్మార్ట్ఫోన్లు విడుదలయ్యాయి.


ఈ నేపథ్యంలో రూ. 30 వేల బడ్జెట్లో స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారి కోసం గాడ్జెట్స్ 360 పొడ్కాస్ట్ ఈ వారం ఎపిసోడ్ నిర్వహించింది.అన్నీ అందుబాటులో ఉంటున్నా కూడా ధరలు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి.భారత మార్కెట్లో తమ బ్రాండ్ను మరింతగా విస్తరించాలని యోచిస్తోన్న వన్‌ప్లస్.. ప్రీమియం ఫీచర్లతో కూడిన వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ను రూ. 29,999 ధర వద్దే ప్రారంభించింది. ఇది విడుదలైన కొద్ది రోజులకే పోటీగా షియోమి ఎంఐ 10 ఐ స్మార్ట్ఫోన్ను రూ. 21,999 ధర వద్ద విడుదలైంది. దీనితో పాటు ఇదే ధరల శ్రేణిలో ఎంఐ 11 ఎక్స్ మోడల్ను విడుదల చేసింది..


ఇక పోతే శామ్సంగ్ నుండి రూ. 30,000 ధరల సెగ్మెంట్లో, కొత్తగా గెలాక్సీ ఎం 42 విడుదలైంది. ఈ స్మార్ట్ఫోన్లో 5జి టెక్నాలజీని అందించింది. ఈ స్మార్ట్ఫోన్ రియల్మీ X7 ప్రో 5 జి మోడల్కు గట్టి పోటీనిచ్చింది. ఇక, ఇటీవల స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుండి నిష్క్రమించిన ఎల్జీ కంపెనీ కూడా గతేడాది ఎల్‌జి వింగ్ పేరుతో రూ. 36,375 ధర వద్ద స్మార్ట్ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఇక, ఇదే ధర వద్ద శామ్సంగ్ నుంచి గెలాక్సీ ఎ 52 5 జి అనే మరో మోడల్‌ కూడా విడుదలైంది. ఈ స్మార్ట్ఫోన్లన్నీ రూ. 30 వేల ధరల శ్రేణిలో బెస్ట్ మోడల్స్గా నిలిచాయి.. ఇవన్నీ కూడా భారత దేశంలో వున్న 30000 లో వచ్చే ఫోన్లు..


మరింత సమాచారం తెలుసుకోండి: