ప్రముఖ బ్రాండెడ్ కలిగిన ఒప్పో సంస్థ నుంచి.. సరికొత్తగా మొబైల్స్ ఎన్నో విడుదల అవుతూనే ఉన్నాయి.. వీటితోపాటుగా బ్లూటూత్ నెక్ బ్యాండ్ వంటివాటిలో కూడా తన హవాను కొనసాగిస్తోంది. ఇక వాటిని ఎంతో పటిష్టంగా తయారు చేయబడడం జరిగింది.. అది కూడా కేవలం తక్కువ ఛార్జింగ్ తోనే ఎక్కువ గంటలు వచ్చే విధంగా ఒక వైర్లెస్ బ్యాండ్ ను తక్కువ ధరకే ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Oppo ENCO M32: మోడల్ కలిగిన ఈ నెక్ బ్యాండ్ అసలు ధర 1,799 రూపాయలకే ఒప్పో సంస్థ మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఈ NECKBAND సరికొత్తగా విడుదల చేయడంతో అందుకు తగ్గట్టుగా ఆఫర్ ను కూడా అందిస్తూ  300 రూపాయల ను తగ్గించి.. దీనిని 1,499 రూపాయలకే మనకు అందిస్తోంది. ఈ ఆఫర్ ను ఈనెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు అమెజాన్ లో  ప్రకటించినట్లుగా ఆ సంస్థ తెలియజేయడం జరిగింది. ఒకవేళ మీ దగ్గరలో ఒప్పో స్టోర్ కూడా ఉన్నట్లయితే.. అక్కడ కూడా ఇది అందుబాటులో ఉంటుందట. అయితే ఈ నెక్ బ్యాండ్ యొక్క ఫీచర్లు విషయానికి వస్తే..

ఇది మన మొబైల్ నుంచి 10 మీటర్స్ దూరం వరకు ఎక్కడున్నా మన మొబైల్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అంతే కాకుండా అంత దూరం వరకు స్పష్టమైన  మాటలతో, సాంగ్స్ వింటున్నప్పుడు.. ఎటువంటి శబ్దం లేకుండా వినిపిస్తాయట.. ఇది మనం ఎక్కడైనా దుమ్ము, వాటర్ రెసిస్టెంట్ ని కలిగి ఉండేలా దీనిని అమర్చినట్లు ఒప్పో సంస్థ తెలియజేసింది. ఇక ఈ బ్లూటూత్ కనెక్టివిటీ విషయానికి వస్తే..5.0 కనెక్టివిటీ తో ఉంటుంది. అందుచేతనే ఇది ఎటువంటి అంతరాయం లేకుండా మనం మాట్లాడే మాటలు స్పష్టంగా అవతల వారికి వినిపిస్తాయి. కేవలం పది నిమిషాలు ఛార్జింగ్ తో 20 గంటల వరకు ప్లేబ్యాక్ సాంగ్స్ వినవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: