ప్రముఖ మోటరోలా కంపెనీ అత్యాధునిక మోడల్స్‌తో పాటు మంచి స్పెసిఫికేషన్స్‌తో మార్కెట్‌లోకి కొత్త ఫోన్స్‌ని లాంచ్ చేస్తూ వస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఇక ఇప్పటికే Moto G40 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన కంపెనీ Moto G52, motorola Edge 30 స్మార్ట్ ఫోన్లను కూడా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇక ఇప్పుడు మోటో G42 లాంచ్ డేట్ కూడా ఫిక్స్ చేసింది.తమ కొత్త G-సిరీస్ ఫోన్‌లు, Moto G62 ఇంకా Moto G42లను ఈ నెల ప్రారంభంలో విడుదల చేసింది. ఇప్పుడు,ఈ బ్రాండ్ త్వరలో భారతదేశంలో Moto G42 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు కూడా కనిపిస్తోంది.ఇక జూలై 4వ తేదీన భారతదేశంలో లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. ఈ ఫోన్ అంతర్జాతీయంగా లాంచ్ అయినప్పటి నుండి ఇక దాని స్పెసిఫికేషన్‌లు మనకు ఇప్పటికే తెలుసు.దీని బేస్ మోడల్‌ ధర వచ్చేసి దాదాపు రూ. 15,000 ఉంటుందని మనము గమనించవచ్చు. అలాగే ఇక ఇండియాలో త్వరలో 5g స్పెక్ట్రమ్‌ అందుబాటు లోకి రాబోతోంది. కాబట్టి 4G మోడళ్లను తీసుకునేవారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించాల్సి ఉంటుంది.Moto G42 స్మార్ట్ ఫోన్ 6.4-అంగుళాల పూర్తి-HD+ OLED డిస్‌ప్లేతో 2,400 X 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్ ఇంకా 20:9 యాస్పెక్ట్ రేషియో ఇంకా అలాగే పంచ్-హోల్ కటౌట్ ఇంకా అలాగే కంటి రక్షణ కోసం నైట్ మోడ్‌ని కలిగి ఉంది. ఇది గ్రాఫిక్స్ కోసం Adreno 610 GPUతో జత చేయబడిన Qualcomm Snapdragon 680 చిప్‌సెట్ ద్వారా మంచి శక్తిని పొందుతుంది.


ఫోన్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత MyUX కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రన్ అవుతుంది. ఇంకా అలాగే 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుంది.ఇంకా అలాగే కనెక్టివిటీ ఫీచర్లలో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.0, GPS, USB టైప్-C ఇంకా NFC ఉన్నాయి. భద్రత, డాల్బీ అట్మోస్, స్టీరియో స్పీకర్లు ఇంకా డ్యూయల్ సిమ్ సపోర్ట్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే దీని కొలతలు గమనిస్తే 160.4×73.5×7.99 ఇంకా బరువు 174.5 గ్రాములు గా ఉంది.ఇక కెమెరా ఆప్టిక్స్‌ వివరాలు కనుక చూస్తే, ఈ Moto G42 వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఇంకా 8MP అల్ట్రా-వైడ్/డెప్త్ హైబ్రిడ్ లెన్స్ ఇంకా 2MP మైక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు  ఇంకా వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా అనేది ఉంది. Moto G42 వచ్చే వారం లో లాంచ్ కావొచ్చని భావిస్తుండడం కారణంగా దాని ధర ఇంకా అలాగే లభ్యత వివరాలు అంచనా వేయబడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: