ప్రస్తుతం భారత టెలికాం దిగ్గజ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ సరికొత్తగా తమ కష్టమర్లను ఆకర్షించుకోవడానికి కొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది. నిజానికి భారతదేశ మార్కెట్లో ప్రముఖ కంపెనీలు అయినటువంటి రిలయన్స్ జియో , ఎయిర్టెల్ , వోడాఫోన్ ఐడియా ఇవన్నీ కూడా 5g వైపు పరుగులు తీస్తుంటే బిఎస్ఎన్ఎల్ ఉన్నపాటి లోనే కస్టమర్లను ఆకర్షించడానికి అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెడుతోంది. ఇక ఈ క్రమంలోని 300 రోజుల వాలిడిటీతో నెలకు 75 జీబీ డేటా అందిస్తూ మరింత ఆకర్షణగా కస్టమర్లను ఆకర్షిస్తుంది.

ఇక ఈ నేపథ్యంలోనే బిఎస్ఎన్ఎల్ కంపెనీ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించడం గమనార్హం. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.2,022 కాగా.. 300 రోజుల వాయిస్ కాలింగ్ లిమిటెడ్ తో నెలకు 75 జిబి డేటాను పొందవచ్చు. అయితే డేటా అయిపోయిన తర్వాత మీరు 40 కేబీపీఎస్ వేగంతో డేటాను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే నెలకు 75 జిబి డేటా కేవలం రెండు నెలలకు మాత్రమే వర్తించడం గమనార్హం. దీని తర్వాత కస్టమర్లు కూడా డేటా ఓచర్లను రీఛార్జి చేయాల్సి ఉంటుంది. ఇకపోతే అపరిమిత వాయిస్ కాలింగ్ మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. అంతే కాదు అన్ని నెట్వర్క్లకు మీరు ఉచితంగా వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు.

ఇకపోతే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను 300 రోజులపాటు పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఆఫర్ ఎక్కువ కాలం చెల్లుబాటు లో ఉండడంతో వినియోగదారులు కూడా ఈ ఆఫర్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇతర ఆఫర్ల విషయానికి వస్తే రూ.3299 కాగా సంవత్సరం పొడవునా 12 నెలల పాటు 2.5 GB డేటాను అందిస్తుంది. రూ.2,299 రీఛార్జ్ చేసుకుంటే 12 నెలలపాటు నెలకు 1.5 జీబీ తో పాటు అన్ని ఆఫర్లను పొందవచ్చు. ఇక అంతే కాకుండా బిఎస్ఎన్ఎల్ సంవత్సరానికి రూ.1,251 వార్షిక ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: