ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ వినియోగం ఎక్కువగా చేస్తున్నారు. దీంతో కంపెనీలు కూడా సరికొత్త మొబైల్స్ ను తయారు చేస్తూ కస్టమర్లకు సరికొత్త అనుభూతిని తీసుకువచ్చేలా చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఆయన ఇన్ఫినిక్స్ ఇండియన్ వినియోగదారుల కోసం తక్కువ బడ్జెట్ లోనే ఒక మొబైల్ ని ప్రవేశపెట్టడం జరుగుతోంది. ఇటీవల 5g నెట్వర్కు రావడంతో 5 G మొబైల్స్ కు డిమాండ్ భారీగానే పెరిగిపోతుంది. జి ఈ మొబైల్ తో మార్కెట్లో తన స్థానాన్ని స్థిరంగా ఉంచుకోవాలని చూస్తోంది ఈ సంస్థ.

అందులో భాగంగానే కేవలం రూ.11,999 రూపాయలకి అత్యధిక 5g మొబైల్ ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ మొబైల్ డిసెంబర్ 9వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మొబైల్ భారతీయ కస్టమర్లను ఆకట్టుకొనే ఫీచర్స్ తో అధునాతన టెక్నాలజీతో  ఈ మొబైల్ రాబోతోంది. ఈ మొబైల్ మోడల్ విషయానికి వస్తే..HOT 20 5g మోడల్గా నామకరణం చేశారు ఈ మొబైల్లో 50. mp డ్యూయల్ కెమెరాతోపాటు సెల్ఫీ ప్రియుల కోసం 8 ఎంపీ మెగాపిక్సల్ కెమెరాను అందించనుంది.


ఇక బ్యాటరీ విషయానికి వస్తే 500 MAH  సామర్థ్యంతో కలిగి ఉంటుంది.18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది ఇక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్, డ్యూయల్ బ్రాండ్ వైఫై, డ్యూయల్ సిమ్ తదితర ఫీచర్లు కలవు. ఈ మొబైల్ మూడు కలర్లలో లభిస్తుంది.4GB RAM+64 GB స్టోరేజ్ మెమొరీ తో ఈ మొబైల్ కలదు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కొన్ని మొబైల్స్ కు పోటీగా ఈ మొబైల్ వస్తున్నట్లుగా మార్కెట్ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం 180 W చార్జింగ్ సపోర్టు కలిగిన INFINIX zero ULTRA మొబైల్ ని కూడా విడుదల చేసింది ఇందులో 5g మొబైల్ తో పాటు...200 mp కెమెరా ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: