మనలో చాలామంది కొత్త కారు కొనాలని చాలా కలలు కంటూ ఉంటారు. ముఖ్యంగా అలాంటి వారికోసం మిడిల్ క్లాస్ కొనగలిగే టాటా నానో ఎలక్ట్రిక్ కారును తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా కూడా టాటా అంటే ఒక బ్రాండ్ గా మారిపోయింది. గతంలో ఈ కంపెనీకి సంబంధించి నానో కార్ల ఉత్పత్తిని కూడా ఆపివేసింది. ఇప్పుడు తాజాగా ఎలక్ట్రిక్ వేరియేషన్లో సరికొత్త కారు ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలోనే నానో కారు రేంజ్ మరింత ఆకర్షణీయంగా ఉండేలా చూస్తూ సరసమైన ధరలకే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా తీసుకురాబోతోందట.


ఎలక్ట్రిక్ నానో కారు లాంచ్ గురించి ఇంకా అధికారికంగా అయితే తెలుపలేదు కానీ. కొంతమంది టెక్ నిపుణులు తెలిపిన ఊహాగానాల ప్రకారం ఇవి వైరల్ గా మారుతున్నాయి.


టాటా నానో E. v ఫీచర్స్:
ఈ కారు అడ్వాన్స్ ఫీచర్స్ తో తయారు చేస్తారట. ఇందులో ఉండే ఫీచర్ ని చూసి చాలామంది ఈ కారుని ఇష్టపడతారు. 7 అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు ఇన్ఫోటైన్మెంట్ సిస్టం కూడా ఇందులో కలదట. ఈ కారులో 6 స్పీకర్ సౌండ్ సిస్టం కూడా ఉన్నది. ఇంటర్నెట్, బ్లూటూత్ వంటి కనెక్టివి సహాయంతో పని చేస్తుంది. అలాగే ఇందులో సేఫ్టీ ఫీచర్స్ కూడా మరిన్ని ఉన్నాయి.


ABS స్టీరింగ్ తో పాటు, పవర్ విండోస్, యాంటీ రోల్ బాల్, మల్టీ డేటా డిస్ప్లే వంటివి ఉండేందుకు ఎక్కువగా అవకాశం ఉందట.


ఇక ధర విషయానికి వస్తే టాటా నానో ఎలక్ట్రిక్ కార్ ఒకసారి చార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ మోడల్ ధర రూ .5 నుంచి రూ .6 లక్షల రూపాయల వరకు ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే టాటా ఎలక్ట్రిక్ కార్ గురించి గత కొద్దిరోజులుగా ప్రచారం అయితే జరుగుతోంది. కానీ ఇప్పటివరకు ఈ విషయం పైన అధికారికంగా టాటా కంపెనీ ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: