ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ ఎంత పెరిగిందో చాలా సౌకర్యాలు కూడా అంతే అందుబాటులోకి వచ్చాయి. ఇంటి వద్ద కూర్చొని ప్రపంచంలో ఏది జరిగినా తెలుసుకోగలుగుతున్నాం. ఇదే కాకుండా బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు కూడా క్షణాల్లో పూర్తి చేస్తున్నాం. దీని ద్వారా మనకు ఎంత టైం సేఫ్ అవుతుందో అంతే నష్టం కూడా కలుగుతుంది. ఇదే అదునుగా చూసుకున్నటువంటి సైబర్ నేరగాళ్లు మన బ్యాంక్ అకౌంట్ లను, ఇతర పర్సనల్ డేటాను హ్యాక్ చేసి మనల్ని మోసం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏపీకె ఫైల్స్ పేరుతో వాట్సప్ గ్రూపుల్లో అలజడి సృష్టించబడింది. ఆధార్ అప్డేట్ తో పాటు  కేవైసీ కి సంబంధించిన వివరాలు సెట్ చేస్తున్నామని బ్యాంకు పేరుతో ఒక లింకు వస్తుంది. మీరు అప్డేట్ చేయకుంటే మీ బ్యాంకు ఖాతాను హ్యాక్ చేస్తామని ఒక మెసేజ్ కనిపిస్తుంది.

 వెంటనే భయపడిపోయిన చాలా మంది ప్రజలు ఆ లింక్ ఓపెన్ చేసి వారికి సంబంధించిన వివరాలను అందులో పొందుపరిచారు. కొన్ని నిమిషాల్లోనే ఇది వైరల్ గా మారి అన్ని వాట్సప్ గ్రూపుల్లో చేరి వేలాదిమంది, డాటాను హ్యాక్ చేయగలిగింది. మరి ఇలాంటి వాట్సప్ గ్రూపుల్లో మీరు కూడా ఈ లింకును ఓపెన్ చేసి ఉంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు తెలియజేస్తున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటి? వివరాలు చూద్దాం.. మీరు కూడా పొరపాటుగా ఈ యాప్ ని ఓపెన్ చేసి ఉంటే ఈ సెట్టింగ్స్ ద్వారా సేఫ్ అవ్వండి..

ముందుగా మీ ఇంటర్నెట్ డేటాను యాప్ లో ఉంచి సెట్టింగ్స్ లోకి వెళ్లి మీరు ఇన్స్టాల్ చేసినటువంటి యాప్ ను అన్ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత  యాంటీ వైరస్ యాప్ తో ఫోన్ ను ఫుల్ గా స్కాన్ చేసేయాలి. మీ ఫోన్ లో ఉండేటువంటి సామాజిక మధ్యమాల పాస్వర్డ్స్ ఇతర బ్యాంకింగ్ యాప్ లు ఏవేవి సీక్రెట్ గా ఉంటాయో, అవన్నీ పాస్వర్డ్ మార్చేయాలి. బ్యాంకింగ్ యాపుల్లో మీకు తెలియని యాక్టివిటీ ఏదైనా ఉందేమో పరిశీలించాలి. ఇన్ని చేసిన ఆ యాప్ అన్ఇన్స్టాల్ అవ్వకపోతే మాత్రం తప్పనిసరిగా ఫోన్ సేఫ్ మోడ్ లో ఉంచి రీస్టార్ట్ చేసి మళ్లీ అన్ఇన్స్టాల్ చేయాలి. అంతేకాదు మీరేదైనా మోసపోయినట్లు గమనిస్తే మాత్రం తప్పనిసరిగా 1930కి కాల్ చేసి మీకు వచ్చిన సమస్య గురించి వివరించాలి. ఈ విధంగా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్, ఇతర పర్సనల్ డేటా సేఫ్ గా ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: